ఆస్ట్రేలియా, శ్రీలంక.. బోణీ ఎవరిదో?

ఆస్ట్రేలియా, శ్రీలంక.. బోణీ ఎవరిదో?

లక్నో: వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియా, శ్రీలంక.. వరల్డ్ కప్‌‌‌‌లో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో ఇరుజట్లు తొలి విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ అయిన ఆసీస్‌‌‌‌కు స్టార్‌‌‌‌ ప్లేయర్లందరూ అందుబాటులో ఉన్నా ఒక్కరు కూడా తమ సత్తాను చూపలేకపోతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు విభాగాల్లో ఫెయిలవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో అత్యధికంగా ఆరు క్యాచ్‌‌‌‌లు వదిలేయడం ఆసీస్‌‌‌‌ పేలవ ఫీల్డింగ్‌‌‌‌కు నిదర్శనం. బ్యాటింగ్‌‌‌‌లో మంచి ఆరంభాలు వస్తున్నా వాటిని భారీ స్కోరుగా మల్చలేకపోతున్నారు. ఇండియా స్పిన్‌‌‌‌కు, సౌతాఫ్రికా పేస్‌‌‌‌కు మధ్యలోనే కుప్పకూలారు.

దీంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌‌‌‌లో మంచి ప్రణాళికలతో ఆడాలని భావిస్తున్నారు. ఇక ఎడమ చేతి ఫ్రాక్చర్‌‌‌‌ నుంచి ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఇప్పటికే నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ మొదలుపెట్టిన హెడ్‌‌‌‌ గురువారం టీమ్‌‌‌‌తో కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు లంక పరిస్థితి కూడా ఆసీస్‌‌‌‌ మాదిరిగానే ఉంది. బౌలింగ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ లేకపోవడం లంకేయులకు అతిపెద్ద బలహీనతగా మారింది. పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో భారీ స్కోరును అడ్డుకోలేకపోయారు. గాయంతో కెప్టెన్‌‌‌‌ షనక్‌‌‌‌ టోర్నీ నుంచి వైదొలగడం జట్టు కూర్పును దెబ్బతీస్తోంది.