టిక్ టాక్ ను నిషేధించే యోచనలో ఆస్ట్రేలియా

టిక్ టాక్ ను నిషేధించే యోచనలో ఆస్ట్రేలియా

చైనా యాప్ టిక్‌ టాక్‌ ను భారత్‌ నిషేధించింది. లేటెస్టుగా ఇండియా బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు.

టిక్‌ టాక్‌ను చైనా ప్రభుత్వం వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు లిబరల్ సెనేటర్ జిమ్ మోలన్. విదేశీ జోక్యంపై సోషల్ మీడియా ద్వారా సెలెక్ట్ కమిటీని ఎదుర్కోవాలని టిక్‌ టాక్ ప్రతినిధులను లేబర్ సెనేటర్ జెన్నీ మెక్‌ అలిస్టర్ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. టిక్‌ టాక్‌పై వస్తున్న ఆరోపణలను దాని యజమాని బైట్‌డాన్స్‌ ఖండిస్తూనే ఉన్నారు. టిక్‌టాక్‌ డేటా అంతా యూఎస్‌, సింగపూర్‌లోని సర్వర్లలో స్టోర్‌ అవుతుందని తెలిపారు.