రెండో టీ20 ఆసీస్‌‌‌‌దే

రెండో టీ20 ఆసీస్‌‌‌‌దే

ఆక్లాండ్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌‌‌‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ 72 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది.  దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఆసీస్‌‌‌‌ 19.5 ఓవర్లలో 174 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (45), కమిన్స్‌‌‌‌ (28), మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (26) రాణించారు. ఫెర్గూసన్‌‌‌‌ 4 వికెట్లు తీశాడు.

ఛేజింగ్‌లో కివీస్ 17 ఓవర్లలో 102 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (42) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. జంపా (4/34), నేథన్‌‌‌‌ ఎలిస్‌‌‌‌ (2/16), కమిన్స్‌‌‌‌ (1/19) దెబ్బకు కివీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. కమిన్స్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. మూడో టీ20 ఆదివారం ఆక్లాండ్‌‌‌‌లో జరుగుతుంది.