ఓడినా..వణికించిన్రు

ఓడినా..వణికించిన్రు
  • ఆసీస్​ చేతిలోపోరాడి ఓడిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌
  •     5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో గట్టెక్కిన కంగారూలు
  •     ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ
  •     రాచిన్‌‌‌‌‌‌‌‌ వంద వృథా

ధర్మశాల: ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఓడినా.. ఆస్ట్రేలియాను మాత్రం వణికించింది. 389 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రాచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (89 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 116), డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (54), జేమ్స్‌‌‌‌‌‌‌‌ నీషమ్‌‌‌‌‌‌‌‌ (58) దుమ్మురేపడంతో విజయానికి చేరువగా వచ్చింది. కానీ ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 19 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసే క్రమంలో నీషమ్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా రనౌట్‌‌‌‌‌‌‌‌ కావడం, ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టలేకపోవడంతో శనివారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ 5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఆసీస్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 109) సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ సాధించాడు.

వార్నర్‌‌‌‌‌‌‌‌ (65 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81)తో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 175 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి బలమైన పునాది వేశాడు. మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (36), స్మిత్‌‌‌‌‌‌‌‌ (18), లబుషేన్‌‌‌‌‌‌‌‌ (18) నిరాశపర్చినా లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా ఆడింది. మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (41)తో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించిన ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (38)..  కమిన్స్‌‌‌‌‌‌‌‌ (37)తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించింది. బౌల్ట్‌‌‌‌‌‌‌‌, ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. హెడ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఆఖరి వరకు పోరాటం..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 383/9 స్కోరు చేసి ఓడింది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో కాన్వే (28), విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (32) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. 10 ఓవర్లలోపే ఈ ఇద్దరు ఔటైనా.. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర సూపర్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొంటూ కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించడంతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ సాఫీగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో నిలకడ తెచ్చారు. కానీ మిచెల్‌‌‌‌‌‌‌‌, లాథమ్‌‌‌‌‌‌‌‌ (21), ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (12) స్వల్ప వ్యవధిలో ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ 265/5తో కష్టాల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన నీషమ్‌‌‌‌‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. రవీంద్ర ఉన్నంతసేపు అతనికి సహకారం అందిస్తూ ఆ తర్వాత తన బ్యాట్‌‌‌‌‌‌‌‌కు పని చెప్పాడు. చివరి ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు క్రీజులో ఉండి గెలిపించినంత పని చేశాడు. రవీంద్రతో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన నీషమ్‌‌‌‌‌‌‌‌.. శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (17)తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 27, హెన్రీ (9)తో ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌ 26, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (10 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. చివరి 6 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 19 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన దశలో ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు రనౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌ తృటిలో గట్టెక్కింది. జంపా 3, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల స్కోరు ఇది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇదే హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ స్కోరు. ఇదే టోర్నీలో సౌతాఫ్రికా (428), శ్రీలంక (326) చేసిన 754 రన్స్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది.

స్కోరు బోర్డు


ఆస్ట్రేలియా: వార్నర్‌‌‌‌‌‌‌‌ (సి అండ్‌‌‌‌‌‌‌‌ బి) ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 81, హెడ్‌‌‌‌‌‌‌‌ (బి) ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 109, మార్ష్‌‌‌‌‌‌‌‌ (బి) శాంట్నర్ 36, స్మిత్‌‌‌‌‌‌‌‌ (సి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (బి) ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 18, లబుషేన్‌‌‌‌‌‌‌‌ (సి) రవీంద్ర (బి) శాంట్నర్‌‌‌‌‌‌‌‌ 18, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (సి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (బి) నీషమ్‌‌‌‌‌‌‌‌ 41, ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (సి) ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 38, కమిన్స్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 37, స్టార్క్‌‌‌‌‌‌‌‌ (సి) నీషమ్‌‌‌‌‌‌‌‌ (బి) హెర్గూన్రీ 1, జంపా (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 0, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 0, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 9, మొత్తం: 49.2 ఓవర్లలో 388 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. వికెట్లపతనం: 1–175, 2–200, 3–228, 4–264, 5–274, 6–235, 7–387, 8–388, 9–388, 10–388.

బౌలింగ్‌‌‌‌‌‌‌‌: హెన్రీ 6.2–0–67–1, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 10–0–77–3, ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ 3–0–38–0, శాంట్నర్‌‌‌‌‌‌‌‌ 10–0–80–2, ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 10–0–37–3, రవీంద్ర 8–0–56–0, నీషమ్‌‌‌‌‌‌‌‌ 2–0–32–1. 


న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: కాన్వే (సి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ (బి) హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 28, విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (సి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ (బి) హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 32, రవీంద్ర (సి) లబుషేన్‌‌‌‌‌‌‌‌ (బి) కమిన్స్‌‌‌‌‌‌‌‌ 116, మిచెల్‌‌‌‌‌‌‌‌ (సి) స్టార్క్‌‌‌‌‌‌‌‌ (బి) జంపా 54, లాథమ్‌‌‌‌‌‌‌‌ (సి) హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (బి) జంపా 21, ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (సి) లబుషేన్‌‌‌‌‌‌‌‌ (బి) మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ 12, నీషమ్‌‌‌‌‌‌‌‌ రనౌట్‌‌‌‌‌‌‌‌ 58, శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (సి) మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (బి) జంపా 17, హెన్రీ (సి) హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (బి) కమిన్స్‌‌‌‌‌‌‌‌ 9, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 10, ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 10, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 26, మొత్తం: 50 ఓవర్లలో 383/9. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–168, 4–222, 5–265, 6–293, 7–320, 8–346, 9–383.

బౌలింగ్‌‌‌‌‌‌‌‌: స్టార్క్‌‌‌‌‌‌‌‌ 9–0–89–0, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 9–0–70–2, కమిన్స్‌‌‌‌‌‌‌‌ 10–0–66–2, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ 10–0–62–1, జంపా 10–0–74–3, మార్ష్‌‌‌‌‌‌‌‌ 2–0–18–0.