పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై.. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై.. తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం

పెర్త్​: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఉస్మాన్ ఖవాజ (34 బ్యాటింగ్),  స్టీవ్  స్మిత్​ (43 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో.. శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆసీస్​ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 33 ఓవర్లలో 84/2 స్కోరు చేసింది. 

డేవిడ్ వార్నర్​ (0), మార్నస్​ లబుషేన్​(2) నిరాశపర్చారు. కుర్రం షెహజాద్​2 వికెట్లు తీశాడు. అంతకుముందు132/2 ఓవర్​నైట్​స్కోరుతో థర్డ్​డే ఆట కొనసాగించిన పాక్​ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 101.5 ఓవర్లలో 271 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 216 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. 

ఇమామ్​(62), బాబర్​ ఆజమ్ (21),  సౌద్​ షకీల్​(28), ఆగా సల్మాన్​(28) రాణించారు. ఆసీస్​ బౌలర్లలో నేథన్​ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, స్టార్క్​, కమిన్స్​ చెరో రెండు వికెట్లు తీశారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంగారూలు 300 రన్స్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.