హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ‘ఆస్ట్రేలియా–ఇండియా లీడర్షిప్’ నాలుగో సదస్సులో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా, ఇండియాకు చెందిన వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగంలోని ప్రముఖులు ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఇండియా –ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలను బలోపేతం చేపట్టడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. విదేశీ విద్యలో భాగంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం విద్యార్థులు ఆస్ట్రేలియానే ఎంచుకుంటున్న నేపథ్యంలో విద్య, టెక్నాలజీ రంగంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు గురించే సదస్సులో చర్చించే అవకాశం ఉంటుందని కేటీఆర్కు పంపిన లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు.

