ఆసీస్‌‌ ప్లేయర్లకూ 6 రోజుల క్వారంటైన్‌‌

ఆసీస్‌‌ ప్లేయర్లకూ 6 రోజుల క్వారంటైన్‌‌

దుబాయ్‌‌: ఇంగ్లండ్‌‌తో వన్డే సిరీస్‌‌ పూర్తి చేసుకొని ఐపీఎల్‌‌ కోసం యూఏఈ రాబోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరు రోజుల మాండేటరి క్వారంటైన్‌‌లో ఉండనున్నారు. ఇంగ్లండ్‌‌లో వాళ్లంతా బయో సెక్యూర్​ బబుల్‌‌లోనే ఉన్నప్పటికీ  దుబాయ్‌‌లో క్వారంటైన్‌‌ రూల్‌‌ను పాటిస్తారని సీఎస్‌‌కే బౌలింగ్‌‌ కన్సల్టెంట్‌‌ ఎరిక్‌‌ సిమన్స్‌‌ చెప్పాడు. బుధవారం ఇంగ్లండ్‌‌తో థర్డ్‌‌ వన్డే తర్వాత స్టీవ్‌‌ స్మిత్‌‌ (రాజస్తాన్‌‌ రాయల్స్‌‌), డేవిడ్‌‌ వార్నర్,  జోష్‌‌ హేజిల్‌‌వుడ్‌‌ (సీఎస్‌‌కే) యూకే నుంచి నేరుగా దుబాయ్‌‌ రానున్నారు. అయితే కరోనా విషయంలో ఎలాంటి అలసత్వం ఉండబోదని, ఆసీస్‌‌ ప్లేయర్లు ఐపీఎల్‌‌లో తమ జట్లతో కలిసే ముందు ఆరు రోజుల క్వారంటైన్‌‌లో ఉండి రెండు నెగెటివ్‌‌ టెస్ట్‌‌ రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే బయో బబుల్‌‌లో ఉన్న ఆటగాళ్లను నేరుగా ప్రాక్టీస్‌‌కు అనుమతించాలని ఆయా ఫ్రాంచైజీలు అధికారులకు విజ్ఞప్తి చేసినా దానికి అంగీకరించే అవకాశం లేదన్నాడు.