
ఫొటో చూశారుగా ఎంత పెద్ద పిజ్జానో! ఆస్ట్రేలియాలోని పెల్లి గ్రినిస్ ఇటాలియన్ రెస్టారెంట్ ఈ పిజ్జాను తయారు చేసింది. ఇందుకు 90 కిలోల పిండిని, కన్వేయర్ఓవెన్ ను ఉపయోగించింది. దీని తయారీకి 4గంటల సమయం పట్టింది. అయితే ఇదేం రికార్డు కోసం చేయలేదు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు కష్టపడుతున్న ఫైర్ ఫైటర్స్ కోసం ఈఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ పిజ్జాను 4వేల ముక్కలు చేసి పంపిణీ చేశారు. ఈవెంట్ కు దాదాపు 3వేల మంది హాజరై మనీ డొనేట్ చేశారు. ఈ మనీని న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కు అంద జేయనున్నా రు. ‘‘ ఇది ప్రపంచరికార్డు అయుండకపోవచ్చు. కానీ మరిన్ని నిధుల సేకరణకు ఇది హెల్ప్ చేసింది’’ అని ఆర్గనైజర్లు చెప్పారు.