పెర్త్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజే క్లైమాక్స్ కు చేరుకుంది. తొలి రోజు ఏకంగా 19 వికెట్లు కూలడంతో పాటు రెండో రోజు ఇంగ్లాండ్ ఆలౌటైంది. 9 వికెట్ల నష్టానికి 123 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం 164 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 40 పరుగులు కలుపుకొని ఆసీస్ ముందు 205 పరుగుల టార్గెట్ ఉంచింది.
రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో విఫలం:
9 వికెట్ల నష్టానికి 123 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 9 పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల లీడ్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం 164 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో వికెట్ నష్టానికి 65 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ లంచ్ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్టార్క్, బొలాండ్ విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి 6 వికెట్ల నష్టానికి 88 పరులతో నిలిచింది.
లోయర్ ఆర్డర్ లో అట్కిన్సన్ (37), కార్స్ (20) కాసేపు మెరుపులు మెరిపించి జట్టు స్కోర్ ను 164 పరుగులకు చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, డాగెట్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో స్టార్క్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు తీసుకోవడం విశేషం. 205 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో బౌలర్ల హవా:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లలో 172 రన్స్‌కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (52), ఒలీ పోప్ (46), జెమీ స్మిత్ (33), బెన్ డకెట్ (21) మాత్రమే రాణించారు. జాక్ క్రాలీ (0), జో రూట్ (0), స్టోక్స్ (6), అట్కిన్సన్ (1), బ్రైడన్ కార్స్ (6), ఆర్చర్ (0 నాటౌట్), మార్క్ వుడ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (7/58) కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేస్తే డాగెట్ 2, గ్రీన్ ఒక వికెట్ తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (24), ట్రావిస్ హెడ్ (21), స్మిత్ (17)సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగితే కార్స్ మూడు.. ఆర్చర్ రెండు వికెట్లు తీశారు.
