V6 News

తొలి సెమీస్ లో వెస్టిండిస్ చిత్తు.. ఫైనల్​ కు ఆసిస్

తొలి సెమీస్ లో వెస్టిండిస్ చిత్తు.. ఫైనల్​ కు ఆసిస్

వెల్లింగ్టన్‌‌: ఆస్ట్రేలియా క్రికెట్‌‌ టీమ్‌‌ విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో ఫైనల్​ చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీస్‌‌లో ఆసీస్​ 157 రన్స్‌‌ తేడాతో వెస్టిండీస్‌‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన ఆసీస్​ 305/3   స్కోరు సాధించింది. అలీసా హీలీ (129) సెంచరీ కొట్టగా.. రాచెల్‌‌ హేన్స్‌‌ (85), బెత్‌‌ మూనీ (43*) రాణించారు. అనంతరం భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో విండీస్‌‌ 37 ఓవర్లలో148 రన్స్‌‌కే కుప్పకూలింది. కెప్టెన్‌‌ స్టెఫానీ టేలర్‌‌ (48) టాప్​ స్కోరర్​. ఆసీస్‌‌ బౌలర్లలో జొనాసెన్‌‌ (2/14) రెండు వికెట్లు పడగొట్టింది. హీలీకి ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. గురువారం జరిగే రెండో సెమీస్‌‌లో ఇంగ్లండ్‌‌.. సౌతాఫ్రికాతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్‌‌లో నెగ్గిన జట్టు  ఆదివారం ఆసీస్‌‌తో ఫైనల్‌‌ ఆడుతుంది.