మాంచెస్టర్: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి తప్పించుకుంది. భారీ వర్షం కారణంగా ఐదో రోజు ఆదివారం ఆట పూర్తిగా రద్దవడంతో ఈ మ్యాచ్ డ్రా అయింది. దాంతో ఐదు టెస్టుల సిరీస్ను ఆసీస్ నిలబెట్టుకుంది . తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 317 రన్స్‌కే ఆలౌటవగా ఇంగ్లండ్ 592 స్కోరు చేసి భారీ లీడ్ దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన ఆసీస్ 214/5 స్కోరుతో నాలుగో రోజు ఆటను ముగించింది. అప్పటికి 61 రన్స్ వెనుకంజలో నిలిచింది. సిరీస్లో ఆసీస్ 2–1తో లీడ్లో ఉంది. ఐదో టెస్ట్ ఈ నెల 27 నుంచి జరుగుతుంది.
