
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ క్లైమాక్స్ కు వచ్చింది. సౌతాఫ్రికా ముందు ఆస్ట్రేలియా ఛాలెంజింగ్ టార్గెట్ సెట్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 144/8 తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 282 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్న ఈ మ్యాచ్ లో సఫారీలు ఆసీస్ పేసర్లను తట్టుకొని టార్గెట్ ఛేజ్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ రోజే మ్యాచ్ ఫలితం వచ్చినా ఆశ్చర్యం లేదు.
హాఫ్ సెంచరీతో స్టార్క్ పోరాటం:
8 వికెట్ల నష్టానికి 144 పరుగులతో మూడో రోజు ఆయను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 2 పరుగులు చేసిన లియాన్ కు రబడా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న సమయంలో చివరి వికెట్ కు స్టార్క్ (58), హేజల్ వుడ్ (17) అద్భుతంగా పోరాడారు. సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఆసీస్ ఆధిక్యం 275 పరుగులు దాటింది. స్టార్క్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు.
చివరి వికెట్ రూపంలో కంగారు పెడుతున్న ఈ జోడీని ఎట్టకేలకు మార్కరం విడగొట్టాడు. 17 పరుగులు చేసిన హేజల్ వుడ్ మార్కరం బౌలింగ్ లో ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. పదో వికెట్ కు స్టార్, హేజల్ వుడ్ జోడీ 135 బంతుల్లో 55 పరుగులు జోడించి జట్టుకు కీలక పరుగులు అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి 3.. జాన్సెన్, ముల్డర్, మార్కరం తలో వికెట్ తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. 43/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌కు 74 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది
What a morning for Australia after Mitchell Starc's crucial batting effort.
— cricket.com.au (@cricketcomau) June 13, 2025
Predictions from here? #WTC25 pic.twitter.com/7pz1zy6FIt