స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌కు చోటు

స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌,  మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌కు చోటు

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌:

ఇండియాతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు ఆస్ట్రేలియా 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌కు దూరమైన మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌, స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌, గ్లెన్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌లో ఫ్రాక్చర్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టారు. అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌కు చోటు కల్పించారు.  పేసర్‌‌‌‌‌‌‌‌ స్పెన్సర్‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌, మార్నస్‌‌‌‌‌‌‌‌ లబుషేన్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 24, 28, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1న వరుసగా మొహాలీ, ఇండోర్‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌కోట్​లో మూడు వన్డేలు జరగనున్నాయి. 

ఆసీస్‌‌‌‌‌‌‌‌ జట్టు: కమిన్స్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), సీన్‌‌‌‌‌‌‌‌ అబాట్‌‌‌‌‌‌‌‌, అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ, నేథన్‌‌‌‌‌‌‌‌ ఎల్లిస్‌‌‌‌‌‌‌‌, కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌, హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌, స్పెన్సన్‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌, తన్వీర్‌‌‌‌‌‌‌‌ సంగా, మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌, వార్నర్‌‌‌‌‌‌‌‌, జంపా.