IND vs AUS U19 WC: ఫైనల్ సమరం: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా

IND vs AUS U19 WC: ఫైనల్ సమరం: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది సమరం ప్రారంభం అయింది. కుర్రాళ్ళ మధ్య జరిగే పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో ఆసక్తికరంగా మారింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. 2003 భారత సీనియర్ క్రికెట్ జట్టు ఫైనల్ కు వచ్చి ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గడ్డపై ఓడిపోయింది. అయితే ఈ సారి సఫారీ గడ్డపై కుర్రాళ్ళు తలపడుతున్నారు. మరి ఈ సారి కుర్రాలైనా కప్ కొడతారేమో చూడాలి. 

ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): 

హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్ ), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(వికెట్ కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్

ALSO READ :- విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు క్షమాపణలు చెప్పిన డివిలియర్స్

ఇండియా U19 (ప్లేయింగ్ XI):

ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే