యాషెస్‌‌‌‌‌‌‌‌ రెండో టెస్ట్‌.. ఆస్ట్రేలియా 378/6

యాషెస్‌‌‌‌‌‌‌‌ రెండో టెస్ట్‌.. ఆస్ట్రేలియా 378/6

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న యాషెస్‌‌‌‌‌‌‌‌ రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ (డేనైట్‌‌‌‌‌‌‌‌)లో ఆస్ట్రేలియా దీటుగా ఆడుతోంది. జాక్‌‌‌‌‌‌‌‌ వెదరాల్డ్‌‌‌‌‌‌‌‌ (72), మార్నస్‌‌‌‌‌‌‌‌ లబుషేన్‌‌‌‌‌‌‌‌ (65), స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (61) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు ఆసీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 73 ఓవర్లలో 378/6 స్కోరు చేసింది. అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (46 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), మైకేల్‌‌‌‌‌‌‌‌ నెసర్‌‌‌‌‌‌‌‌ (15 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఆరంభం నుంచే వన్డే తరహాలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన కంగారూలు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టారు.

కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (45), ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (33) కూడా రాణించగా..  జోస్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (23) నిరాశపర్చాడు. చివర్లో క్యారీ, నెసర్‌‌‌‌‌‌‌‌ మరో వికెట్‌‌‌‌‌‌‌‌ పడకుండా రోజును ముగించారు. బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌ 3, స్టోక్స్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 325/9 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 76.2 ఓవర్లలో 334 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రూట్‌‌‌‌‌‌‌‌ (138 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో అజేయంగా నిలిచాడు. స్టార్క్‌‌‌‌‌‌‌‌ 6 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్‌‌‌‌‌‌‌‌ 44 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.