క‌రోనా టెస్ట్ చేయించుకుంటే రూ.25వేలు, పాజిటీవ్ వ‌స్తే రూ.ల‌క్షా 11వేలు చెల్లిస్తాం

క‌రోనా టెస్ట్ చేయించుకుంటే రూ.25వేలు, పాజిటీవ్ వ‌స్తే రూ.ల‌క్షా 11వేలు చెల్లిస్తాం

క‌రోనా వైర‌స్ టెస్ట్ లు చేయించుకున్నవారికి ఇండియ‌న్ క‌రెన్సీ ప్ర‌కారం రూ.25వేలు,పాజిటీవ్ వ‌చ్చిన‌వారికి రూ.లక్షా 11వేల రూపాయాల్ని చెల్లిస్తామ‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
ఆస్టేలియా విక్టోరియా రాష్ట్రంలో జూలై 7 నుంచి జూలై 21 మధ్య 3,800 మందికి పైగా క‌రోనా వైర‌స్ సోకింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు విక్టోరియా సీఎం డేనియ‌ల్ ఆండ్రూస్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనుమానితులు క‌రోనా టెస్ట్ చేయించుకుంటే 300డాల‌ర్లు, టెస్ట్ ల్లో పాజిటీవ్ వ‌స్తే 1500డాల‌ర్లు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇందుకు కొన్ని ష‌ర‌తులు విధించారు. విధులు నిర్వ‌హిస్తూ, గ‌తంలో ఎలాంటి సిక్ లేని ఉద్యోగుల‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ఆర్ధిక సాయం పొందాల‌నుకునే ఉద్యోగులు త‌ప్ప‌ని స‌రిగా పేస్లిప్ సబ్మిట్ చేయాల‌న్నారు.
ఈ ఆర్ధిక సాయం ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ బాధితుల్ని సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చని విక్టోరియా సీఎం డేనియ‌ల్ ఆండ్రూస్ ప్ర‌క‌టించారు.