బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ (డేనైట్)లోనూ ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 2–0 ఆధిక్యంలో నిలిచారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 65 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 69/2 స్కోరు చేసి నెగ్గింది. ట్రావిస్ హెడ్ (22), స్మిత్ (23 నాటౌట్), జాక్ వెదరాల్డ్ (17 నాటౌట్) మెరుగ్గా ఆడారు. లబుషేన్ (3) ఫెయిలయ్యాడు.
అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు 134/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75.2 ఓవర్లలో 241 రన్స్‌కు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50), విల్ జాక్స్ (41) మెరుగ్గా ఆడినా అట్కిన్సన్ (3), బైడన్ కార్స్ (7), ఆర్చర్ (5 నాటౌట్) నిరాశపర్చారు. మైకేల్ నీసర్ (5/42) ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం నుంచి అడిలైడ్‌లో మూడో టెస్ట్ జరుగుతుంది.
