Women's ODI World Cup 2025: సెమీస్‌లో టాస్ ఓడిన ఇండియా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్

Women's ODI World Cup 2025: సెమీస్‌లో టాస్ ఓడిన ఇండియా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 30) రెండో సెమీ ఫైనల్ ప్రారంభమైంది. నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సెమీస్ సమరంలో ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ వచ్చింది. మరోవైపు ఇండియా గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో షెఫాలీ వర్మను తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ కు దూరంగా ఉన్న రిచా ఘోష్  జట్టులోకి వచ్చింది. హర్లీన్ డియోల్ స్థానంలో క్రాంతి గౌడ్ ప్లేయింగ్ 11లోకి వచ్చింది. 

కంగారూలను పడగొట్టాలంటే ఎనిమిదేండ్ల కిందట వరల్డ్ కప్ సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆ టీమ్‌‌పై కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ హిస్టారికల్ సెంచరీ వంటి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌  అద్భుతం జరగాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది. 2017లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లోని  డెర్బీ స్టేడియంలో జరిగిన నాటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హర్మన్‌‌‌‌‌‌‌‌ (115 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 171 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సునామీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ విమెన్స్ టీమ్ గతినే మార్చేసింది. ఇప్పుడు కూడా ఆసీస్‌‌పై గెలిస్తే  ఇండియా అమ్మాయిలు తొలి ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. 

భారత మహిళలు (ప్లేయింగ్ XI):

షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI):

ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్