IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో టీ20లో ఇండియా బ్యాటింగ్

IND vs AUS 2nd T20I: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో టీ20లో ఇండియా బ్యాటింగ్

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 31) ప్రారంభమైంది. మెల్ బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన నాలుగు టీ20 ల్లో మూడు మ్యాచ్ ల్లో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా దిగుతుంది. మరోవైపు  ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలుపే లక్ష్యంగా సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ సేన బరిలోకి దిగుతోంది.

అయితే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మాదిరిగానే ఈ పోరుకూ వాన గండం పొంచి ఉందని వాతావరణ నివేదిక. కాసేపు దీనిని పక్కనబెడితే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సూర్య గాడిలో పడటంతో టీమిండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బలం మరింత పెరిగింది. ఒకవేళ రెండో టీ20 పూర్తిగా జరిగితే అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, సూర్య,  గిల్‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో రెచ్చిపోవడం ఖాయం. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ బుమ్రా, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. 

జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

ఇండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా