
మార్చి 31 నుంచి ఐపీఎల్ సందడి షురూ కానుంది. 10 ఫ్రాంఛైజీలో ఐపీఎల్ 2023 టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయి. ఇందులో భాగంగా అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సారి ఐపీఎల్ ఏ జట్టు గెలుస్తుందో చెప్పేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. అంతేకాదు ప్లే ఆఫ్ చేరే నాలుగు జట్లేవో కూడా తేల్చేశాడు.
ప్లే ఆఫ్ చేరే జట్లేంటే...
ఐపీఎల్ 2023 మినీవేలంలో స్టీవ్ స్మిత్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో అతను 2023 ఐపీఎల్లో కామెంటేటర్‌గా కొత్త అవతారమెత్తనున్నాడు. అయితే ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్ జట్లపై స్టీవ్ స్మిత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సారి టాప్ 4లో నిలిచే జట్లను చెప్పేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని జోస్యం చెప్పాడు.
ఏ జట్టు గెలుస్తుందంటే..
2023 ఐపీఎల్ ఏ జట్టు గెలుస్తుందో కూడా స్మిత్ వెల్లడించాడు. గుజరాత్ టైటాన్స్ మరోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్నాడు. తన అంచనా ప్రకారం ఐపీఎల్ 2023 టైటిల్ గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంటుందని తెలిపాడు. రన్నరప్ గా చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలుస్తాయని పేర్కొన్నాడు.