Australia media: టీమిండియా అమ్మాయిల పోరాటం అద్భుతం : లైఫ్ టైం ఇన్నింగ్స్ ఆడారు.. ఆస్ట్రేలియా మీడియా జయహో

Australia media: టీమిండియా అమ్మాయిల పోరాటం అద్భుతం : లైఫ్ టైం ఇన్నింగ్స్ ఆడారు.. ఆస్ట్రేలియా మీడియా జయహో

గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా.. శుభోదయం ఆస్త్రేలియా.. అద్భుతం.. మహా అద్భుతం.. భారత మహిళా క్రికెట్ జట్టు జీవితకాలం గుర్తుండే ఇన్నింగ్స్ ఆడింది.. భారతదేశం నుంచి అద్భుతమైన పరుగుల వేటతో.. రాత్రి పూట విమెన్స్ వరల్డ్ కప్ రేసులో మన జట్టు కథ ముగిసింది.. దురదృష్టవశాత్తు మనం ఓడిపోయాం.. జెమీమా రొడ్రిగ్స్ అద్భుతమైన ఆటతో మన రక్షణ గోడ కూలిపోయింది.. ప్రపంచ కప్ లో మన ప్రస్థానం ముగిసింది.. ఈ మాటలు, పొగడ్తలు ఎక్కడో కాదు.. ఆస్ట్రేలియా టీవీల్లో.. విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమితో ఆ దేశంలో క్రికెట్ అభిమానులు షాక్ అయినా.. ఓటమి ఓటమే కదా.. మన జీర్ణించుకోవాలి అంటూ ఆస్ట్రేలియా మీడియా చెప్పుకొచ్చింది. 

విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేసిన తర్వాత.. ఆసీస్ జట్టు గెలుపు ఖాయం అని అందరూ అనుకున్నారు.. ఇదే విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.. అక్కడి మీడియా ఇదే భరోసా, ధీమాతో ఉంది. భారీ టార్గెట్ ఛేజ్ లో మన అమ్మాయిలు అదరగొట్టారు.. జెమీమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.. 127 పరుగులతో నాటౌట్ గా నిలిచి.. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ నుంచి ఆస్ట్రేలియాను ఇంటికి పంపించింది. దీంతో ఆస్ట్రేలియా మీడియా అంతా.. గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా.. మన ఓడిపోయాం.. మన జట్టు కథ ముగిసింది.. జెమీమా రొడ్రిగ్స్ దెబ్బకు మన రక్షణ గోడ బద్దలైంది.. అంటూ మన అమ్మాయిల వీరోచిత పోరాటాన్ని హైలెట్ చేసింది. 

ఇదే టైంలో ఆస్ట్రేలియా అమ్మాయిల ఆటతీరును ఏకిపారేసింది ఆస్ట్రేలియా మీడియా. కెప్టెన్ హీలీ నిరాశపరిచింది.. ఆమె అసలు ఆస్ట్రేలియానే కాదు అంటూ దుమ్మెత్తిపోసింది. మనోళ్ల ఆట చాలా నిరాశ పరిచింది.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారని ఊహించలేదు అంటూ మరో ఛానెల్ తిట్టిపోసింది. 338 పరుగులు భారీ స్కోర్ చేయటం ముఖ్యం కాదు.. గెలుపు ముఖ్యం అంటూ మరో ఛానెల్ విశ్లేషించింది. 

మొత్తంగా భారత మీడియా ఇంత గొప్పగా చెప్పకపోయినా.. విమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో భారత అమ్మాయిల జట్టు సాధించిన విజయాన్ని మాత్రం ఆస్ట్రేలియా మీడియా ఆకాశానికెత్తింది.