
ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ లో మరో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో గార్బిన్ ముగురుజాను 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి తన మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకుంది. అతిచిన్న వయసులో ఓపెన్ టైటిల్ గెలుచుకున్న రెండో క్రీడాకారిణిగా కెనిన్ (21) రికార్డ్ సృష్టించింది .అంతకు ముందు రష్యాకు చెందిన మారియన్ షరపోవా 20 ఏళ్లలో టైటిల్ ను గెలుచుకుంది.
??#AusOpen | #AO2020 | @SofiaKenin pic.twitter.com/qpEzcWgHjE
— #AusOpen (@AustralianOpen) February 1, 2020