ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: సింధు సెమీస్తో సరి

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: సింధు సెమీస్తో సరి

సిడ్నీ: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధుకు.. ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో నిరాశ ఎదురైంది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌ సింధు 20–22, 12–21తో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ అకానె యమగుచి (జపాన్‌‌‌‌) చేతిలో ఓడింది. దాంతో బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కోసం సింధు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. 43 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇద్దరు ప్లేయర్లు ప్రతి పాయింట్‌‌‌‌ కోసం హోరాహోరీగా తలపడ్డారు. 

6–6 నుంచి 20–20 వరకు గట్టిగా పోరాడారు. చివర్లో సింధుకు గేమ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ సాధించే అవకాశం ఉన్నా వృథా చేసుకుంది. రెండో గేమ్‌‌‌‌లో జపాన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆధిపత్యమే ఎక్కువగా నడిచింది. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 13–6తో నిలిచింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.