సిడ్నీ: ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. ఈ సీజన్‌లో ఇంతవరకు టైటిల్ సాధించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ నెగ్గిన ఈ జోడీ.. హాంకాంగ్, చైనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
వరల్డ్ నంబర్ వన్‌గా 18 వారాలు గడిపిన ఈ జోడీ మే నెలలో 27వ స్థానానికి పడిపోయింది. కానీ తర్వాతి టోర్నీలో మళ్లీ రాణించడంతో మూడో ప్లేస్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్.. చాంగ్ కోచి–పో లి వీ (చైనీస్ తైపీ)తో తలపడతారు. ఇక సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్. ఎస్. ప్రణయ్‌పై ఆశలు ఉన్నాయి. కిడాంబి శ్రీకాంత్, ఆయుష్ షెట్టి, కిరణ్ జార్జ్, తరుణ్ తో పాటు విమెన్స్ సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, డబుల్స్‌లో ట్రిసా–గాయత్రి, మిక్స్‌డ్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ కూడా బరిలో ఉన్నారు.
