
క్రికెట్ లో ఎక్కడా చూడని వింత చోటు చేసుకుంది. వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా సోమర్‌సెట్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని సీన్ జరిగింది. ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ స్టంప్‌ను సగానికి విడగొట్టాడు. వికెట్ అడ్డంగా కాకుండా నిలువుగా సగానికి విరిగి పడడం ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా స్టంప్ విరగడం చాలా సార్లు చూసే ఉంటాం. అయితే మెరెడిత్ వేగానికి స్టంప్ నిలువుగా విరగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సోమర్సెట్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని ఎసెక్స్ ఛేజ్ చేసే క్రమంలో ఈ సంఘటన జరిగింది.
ఎసెక్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో, ఓపెనర్ మైఖేల్ పెప్పర్ కు మెరిడిత్ అద్భుతమైన యార్కర్ వేశాడు. ఈ యార్కర్ కు పెప్పర్ వద్ద సమాధానామే లేకుండా పోయింది. బ్యాటర్ ఈ బంతిని అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి సరాసరి లెగ్-స్టంప్ లోకి దూసుకెళ్లి స్టంప్ ను రెండుగా చీల్చింది. ఒక సగం పాతుకుపోగా.. మరొక సగం కింద పడింది. మెరెడిత్ పగిలిపోయిన స్టంప్ వైపు పరుగెత్తుతూ దానిని ట్రోఫీలా ఎత్తుకుని సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం.
►ALSO READ | SRH, HCA వివాదం లో బిగ్ ట్విస్ట్.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టౌంటన్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ఎసెక్స్‌పై సోమర్‌సెట్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ జట్టు 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. టామ్ కోహ్లర్-కాడ్మోర్ కేవలం 39 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. విల్ స్మీడ్ (20 బంతుల్లో 32), సీన్ డిక్సన్ (17 బంతుల్లో 28*) మెరుపులు మెరిపించారు. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎసెక్స్ జట్టు 14.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో సోమర్సెట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది.