 
                                    నవీ ముంబై: ప్రాక్టీస్ సందర్భంగా బాల్ మెడకు బలంగా తాకడంతో ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ గురువారం ఉదయం మరణించాడు. మంగళవారం మెల్‌బోర్న్ సబర్బన్‌లోని ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో పాల్గొన్న 17 ఏళ్ల ఆస్టిన్.. నెట్స్‌లో సైడ్ ఆర్మ్ బాల్స్‌ను ఎదుర్కొనే క్రమంలో మెడకు బాల్ తాకి తీవ్రంగా గాయపడ్డాడు.
హెల్మెట్ ధరించినా నెక్ గార్డ్ పెట్టుకోకపోవడం దెబ్బతీసింది. బలమైన గాయం కావడంతో ఆస్టిన్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ గాయం తీవ్రంగా ఉండటంతో చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. 2014లోనూ ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ ఇలాగే మరణించాడు. ఇండో–ఆసీస్ విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇరుజట్ల ప్లేయర్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి నివాళి అర్పించారు..

 
         
                     
                     
                    