చదువుకుంటూనే ఏదైనా సాదించగలరని నిరూపించారు ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు. ప్రపంచ మేటి సంస్థలకు సాధ్యం కాని దాన్ని ఈ కాలేజీ స్టూడెంట్స్ చేసి చూపించారు. ఒకే చార్జ్ తో 1000 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ కార్ ని తయారుచేసి చూపించారు. అది కూడా సోలార్ ఎనర్జీతో నడిచేది.
విక్టోరియా, వెన్సిడేల్‌లోని ఆస్ట్రేలియన్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్‌లోని 50 మంది విద్యార్థులు సన్‌స్విఫ్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈవీ కార్ ని తయారుచేశారు. ఎలక్ట్రిక్, సోలార్ పవర్ తో పనిచేసే ఈ కార్ ఒకసారి చార్జ్ చేస్తే 1,000 -కిలోమీటర్ల ప్రయాణించగలదు. 85 కి.మీ నిర్దిష్టవేగంతో నడుస్తుంది. తక్కువ పవర్ తో ఎక్కువ దూరం ప్రయాణించే ఈ కార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
