వార ఫలాలు (సౌరమానం): 15-01-2023 నుంచి21-01-2023 వరకు

వార ఫలాలు (సౌరమానం): 15-01-2023 నుంచి21-01-2023 వరకు

మేషం (మార్చి21 ఏప్రిల్ 20)

సమాజంలోప్రత్యేకత చాటుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం సోదరులు, స్నేహితులతో వ్యక్తిగత విషయాలపై చర్చిస్తారు. భూ, వాహనయోగాలు. ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు.మీసలహాలు కుటుంబసభ్యులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అవసరాలకుతగిన రాబడి. వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు తొలగి ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు జరగొచ్చు.

వృషభం (ఏప్రిల్ 21 -మే21)

ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. లక్ష్యాలు సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తివిషయాల్లో తుది అగ్రిమెంట్లు. ఆదాయం ఆశాజనకం. వ్యాపారులకు అనుకున్న రీతిలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు...

మిధునం (మే 22 జూన్ 22)

చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో ముందడుగు. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. క్లిష్ట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.. వాహనాలు, స్థలాలు కొంటారు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరతాయి. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాల పరిష్కారం. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు.

కర్కాటకం (జూన్ 23 - జూలై 23)

నూతన కార్యక్రమాలు సజావుగా పూర్తి. భూములకు సంబంధించి లా వాదేవీలు అనుకూలిస్తాయి. వస్తులాభాలు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. అందరిలో ప్రత్యేక గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావలసిన సొమ్ము అంది రుణాలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కే ఛాన్స్. భాగస్వాముల సాయం మరింత అందుతుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

సింహం (జూలై 24 ఆగస్టు 22)

3 ముఖ్యమైన కార్యక్రమాలలోమరింత పురోగతి. సన్నిహితుల నుంచి అనుకోని ధనలాభం. సొంత ఆలోచనలతో కొన్ని వివాదాల పరిష్కారం. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనసౌఖ్యం. బాకీల వసూలు గృహంకొనే ప్రయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. కొత్త పెట్టుబడులకు మార్గం. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం.

కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22)

సన్నిహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. అనుకున్నసమయానికి కార్యక్రమాలు పూర్తి. ఆదాయం సంతృప్తికరం. సమాజంలో ప్రత్యేక ఆదరణ. వివాహయత్నాల్లో ముందడుగు. దీర్ఘకాలికసమస్య పరిష్కారమయ్యే సూచన. వాహనాలు, స్థలాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. స్వల్ప ధనలబ్ధి. వ్యాపార విస్తరణలో భాగస్వాముల సహకారం. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు.

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 22)

కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి. ఆదాయం మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. బంధువులు, స్నేహితులతో మరింత సఖ్యత. పరిస్థితులు అనుకూలం. అవసరాలకు
తగిన రాబడి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతవర్గాలు సాయం. వీరి సేవలకు తగినంత గుర్తింపు..

వృశ్చికం (అక్టోబర్ 23 నవంబర్ 22)

కొన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి. వాహనాలు. ఆభరణాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరి లోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ప్రత్యర్ధులు స్నేహితులుగా మారతారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారుల కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు కొత్త విధులలో అవకాశం.

ధనుస్సు (నవంబర్ 23 - డిసెంబర్ 22)

కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. వాహనాల విషయంలో కొంత శ్రద్ధవహించాలి. అత్యంతనేర్పు, ఓర్పుతో ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు కొంత తొలగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతపోస్టుల అవకాశం.

మకరం (డిసెంబర్ 23 జనవరి 22)

కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. భూవివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కారం. ఆలోచనలు కార్యరూపం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మారొచ్చు..

కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 22)

ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. అనుకున్నకార్యాలు ఉత్సాహంగా పూర్తి విలువైన సామగ్రి కొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అనుకున్న రాబడి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. బంధువర్గం నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు..

మీనం (ఫిబ్రవరి 23 మార్చి 20)

ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత అనుకూలం. వాహనసౌఖ్యం. రావలసిన సొమ్ము ఆలస్యంగా అంది ఇబ్బంది పడతారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

- వక్కంతం చంద్రమౌళి, జోతీష్య పండితుడు,9885299400