హైదరాబాద్ సిటీలో అధికారులు అలర్ట్.. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు కలిసి సహాయక చర్యలు

 హైదరాబాద్ సిటీలో అధికారులు అలర్ట్.. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు కలిసి సహాయక చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తం అయ్యారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు కలిసి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. లోతైన మ్యాన్ హోళ్లు, మురుగు ఉప్పొంగే ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 మ్యాన్ హోళ్ల వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లోపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఈ మేరకు వాటర్ ​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అమీర్‌‌‌‌పేట‌‌‌‌లోని గాయ‌‌‌‌త్రి కాల‌‌‌‌నీ, మాదాపూర్‌‌‌‌లోని అమ‌‌‌‌ర్ సొసైటీ, బాగ్‌‌‌‌లింగంప‌‌‌‌ల్లి లోని శ్రీ‌‌‌‌రాంన‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌ బస్తీలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.