
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో మొత్తం నుజ్జునుజ్జు అయింది. ఇక కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే కారు మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.