ఎవడీడు.. ఇంత వయలైంట్ ఉన్నాడు : బస్సు డ్రైవర్ ను కొడవలితో బెదిరించిన ఆటో డ్రైవర్

ఎవడీడు.. ఇంత వయలైంట్ ఉన్నాడు : బస్సు డ్రైవర్ ను కొడవలితో బెదిరించిన ఆటో డ్రైవర్

మనుషులు చాలా వయలెంట్ గా తయారవుతున్నారు. చిన్నా పెద్దా అనేది లేకుండా బరి తెగించేస్తున్నారు. కేరళలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కేరళ రాష్ట్రం మలప్పురం ఏరియాలో ఓ ఆటో రోడ్డుపై వెళుతుంది.. రోడ్డు మధ్యలో ఇష్టమొచ్చినట్లు వెళుతుంది.. వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎంతకీ సైడ్ ఇవ్వటం లేదు ఆటో డ్రైవర్.. దీంతో బస్సు డ్రైవర్ పదే పదే హారన్ కొట్టటంతో.. ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..

ఆటోలోని కొడవలిని తీసి.. బస్సు డ్రైవర్ కు చూపించాడు. ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించినా.. హారన్ కొట్టినా.. ఈ కొడవలితో నరుకుతా బిడ్డా అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. ఆటో డ్రైవర్ మరీ వయలెంట్ గా ఉన్నట్లు భావించినా బస్సు డ్రైవర్.. హారన్ కొట్టటం ఆపాడు.. ఆటో వెనకాల ఫాలో అయ్యాడు. ఆటో డ్రైవర్ రన్నింగ్ లోనే.. కొడవలి తీసి బెదిరించటాన్ని.. బస్సులోని ప్రయాణికులు కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. 

బస్సులోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. బస్సు డ్రైవర్ కొంత దూరం అలాగే వెళ్లాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ తన గమ్యస్థానం వచ్చిన తర్వాత.. ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయాడు బస్సు డ్రైవర్. ఆటో డ్రైవర్ వ్యవహారంపై ఫొటోలు, వీడియోలతో పోలీస్ కంప్లయింట్ ఇవ్వగా.. విచారణ చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రయాణికులను ఎక్కించుకునే ఆటో డ్రైవర్ మరీ ఇంత వయలెంట్ గా ఉండటం ఒకటి అయితే.. కత్తులు, కొడవళ్లతో జర్నీ చేయటం అనేదాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.