హైదరాబాద్ లో ఎల్పీజీ కొరతపై సెల్ టవర్ ఎక్కి.. ఆటో డ్రైవర్ల నిరసన

హైదరాబాద్ లో ఎల్పీజీ కొరతపై సెల్ టవర్ ఎక్కి.. ఆటో డ్రైవర్ల నిరసన
  • రాజేంద్రనగర్​ శివరాంపల్లిలో ఉద్రిక్తత

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ శివరాంపల్లి సబ్​స్టేషన్ వద్ద ఎల్పీజీ కొరతను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. పిల్లర్ నం. 291 వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో నాగోల్​కు చెందిన సాయి, అబ్దుల్ అనే ఇద్దరు డ్రైవర్లు సెల్ టవర్ ఎక్కడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

బంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్​లో నిలబడినా సరిపడా గ్యాస్ దొరకక తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే గ్యాస్ సరఫరాను పెంచాలని డిమాండ్ చేశారు.  పోలీసులు అక్కడికి చేరుకుని, టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందికి దించడంతో పరిస్థితి  సద్దుమణిగింది.