హైదరాబాద్సిటీ, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 7న ఆటో బంద్నిర్వహిస్తున్నామని, మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్యూనియన్స్జేఏసీ నాయకులు ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును కోరారు. సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారిలో ఆటో సంఘాల నాయకులు బి.వెంకటేశం, వి.మారయ్య, వి.ప్రవీణ్, ఎ.సత్తిరెడ్డి, శ్రీకాంత్, ఉమర్ఖాన్ తదితరులు ఉన్నారు.

