ఇండియాలో తగ్గిన బండ్ల ఎగుమతులు

ఇండియాలో తగ్గిన బండ్ల ఎగుమతులు

న్యూఢిల్లీ: కిందటి ఆర్థిక సంవత్సరంలో  45 లక్షల   బండ్లు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. కానీ, కొన్ని ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్ మార్కెట్‌‌‌‌లలో నెలకొన్న ఫారిన్ ఎక్స్చేంజ్‌‌‌‌ సమస్యల కారణంగా ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ 5.5 శాతం (ఏడాది ప్రాతిపదికన) తగ్గాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  47.61 లక్షల బండ్లను ఎగుమతి చేశామని సొషైటి ఆఫ్ ఇండియన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్‌‌‌‌) పేర్కొంది. 

ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు పెరిగినా,  టూవీలర్‌‌‌‌‌‌‌‌, త్రీ వీలర్‌‌‌‌‌‌‌‌, కమర్షియల్ వెహికల్ ఎగుమతులు కిందటి ఆర్థిక సంవత్సరంలో తగ్గాయని తెలిపింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో బండ్ల ఎగుమతులు పుంజుకున్నాయని వెల్లడించింది.