సండే షాపింగ్ అని డీమార్ట్కు పోతున్న పబ్లిక్కు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

సండే షాపింగ్ అని డీమార్ట్కు పోతున్న పబ్లిక్కు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

న్యూఢిల్లీ: డీమార్ట్ రిటైల్ స్టోర్ల యజమాన్య సంస్థ అవెన్యూ సూపర్​మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్​లో కంపెనీ ఏకీకృత నికర లాభం 8.5 శాతం పెరిగి రూ.742.98 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.684.85 కోట్లుగా నమోదైంది. ఆదాయం 17.8 శాతం వృద్ధితో రూ.16,676.30 కోట్ల నుంచి రూ.19,644 కోట్లకు ఎగబాకింది.

ఇతర ఆదాయంతో కలిపి మొత్తం రాబడి రూ.19,657.54 కోట్లుగా నిలిచింది. నిర్వహణ వ్యయాలు 18.3 శాతం పెరిగి రూ.18,632.70 కోట్లను తాకాయి.  ఉద్యోగుల వేతనాల పెంపు కారణంగా వ్యయాలు కొద్దిగా అధికమయ్యాయి. ఈ క్వార్టర్​లో కొత్తగా 15 స్టోర్లను ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య 518కి చేరిందని కంపెనీ ప్రకటించింది.