అవినాశ్ బెయిల్​పై విచారణ నేటికి వాయిదా

 అవినాశ్ బెయిల్​పై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి వైఎస్‌‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌‌ ఇవ్వాలని కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌‌ రెడ్డి వేసిన పిటిషన్‌‌పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.  గురువారం సాయంత్రం 6 గంటలకు బెయిల్ అంశం విచారణకు రాగా..వాదనలకు ఎంత సమయం కావాలని ఇరుపక్షాల లాయర్లను జస్టిస్‌‌  ఎం.లక్ష్మణ్‌‌ అడిగారు. 

ఐదారు గంటల సమయం పడుతుందని లాయర్లు చెప్పడంతో విచారణను న్యాయమూర్తి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వేశారు.