సిటీ స్కాన్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

సిటీ స్కాన్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

కరోనా నిర్ధారణ కోసం ప్రతిసారి సిటీ స్కాన్ తీయించవద్దని ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఒకసారి సిటీ స్కాన్ తీయించడం 300-400 సార్లు ఎక్స్‌రేలు తీయించడంతో సమానమన్నారు. స్వల్ప లక్షణాలు ఉంటే సిటీ స్కాన్ తీయించకండి... చిన్న వయసులో అత్యధిక సార్లు సిటీ స్కాన్ తీయిస్తే.. భవిష్యత్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.

సిటీ స్కాన్ ఎక్కువగా చేసుకుంటే రేడియేషన్ తో కాన్సర్ రావచ్చన్నారు రణదీప్ గులేరియా. చెస్ట్ ఎక్స్ రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సిటీ స్కాన్ చేసుకోవాలని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలు ఉన్నావారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి దాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారంతా సిటీ స్కాన్ తీయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.డాక్టర్ల సూచలన ప్రకారమే రోగులు మందులు వాడాలని, మధ్యస్ధ లక్షణాలు ఉన్నవారు అనవసరంగా మందులు తీసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు గులేరియా. కరోనా కట్టడికి సంబంధించి ఏరకంగా మందులు వాడాలి, ఎప్పడు ఆస్పత్రికి వెళ్లాలనేది వెబినార్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామన్న గులేరియా.. వ్యాక్సిన్ పట్ల అపోహలు మాని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.