కరోనా ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్పై కేంద్రం సీరియస్ గైడ్లైన్స్

కరోనా ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్పై కేంద్రం సీరియస్ గైడ్లైన్స్

కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ లో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంపై సీరియస్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నుంచి ఐవర్ మెక్టిన్, ఫావిపిరవిర్, డాక్సీసైక్లిన్ లాంటి వాటిని తొలగిచింది. యాంటివైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను కూడా ప్రోటోకాల్ లో చేర్చలేదు. ట్రీట్మెంట్ కు సంబంధించి ICMR, ఎయిమ్స్, నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా సవరించిన గైడ్ లైన్స్ ఇష్యూ చేశాయి. డిశ్చార్జ్ తర్వాత.. ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అవసరంలేదని, ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న పేషెంట్లకు ఇంజెక్షన్ ద్వారా ఇవ్వగలిగే స్టెరాయిడ్స్ తో బెనిఫిట్ జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారం లేదని గైడ్ లైన్స్ లో తెలిపాయి. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ థెరపీ లేదా ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీ కారణంగా మ్యూకర్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ లాంటివి సోకే ప్రమాదముందని హెచ్చరించింది.