పేద ప్రజలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ : ఆవుల రాజి రెడ్డి

పేద ప్రజలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ : ఆవుల రాజి రెడ్డి

సంగారెడ్డి(హత్నూర), వెలుగు: ప్రభుత్వం ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు భరోసా లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ క్యాంప్ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్​పర్సన్​సుహాసిని రెడ్డితో కలిసి 38 మంది బాధితులకు రూ.16 లక్షల 67000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు హకీమ్, నర్సింహరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి, సంగారెడ్డి, ప్రభు లింగం, కమలాకర్ పాల్గొన్నారు.

దుబ్బాక: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 98 మంది పేద రోగులకు కాంగ్రెస్ ​నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​ రెడ్డి రూ. 35.20 లక్షల సీఎంఆర్​ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే ధ్యేయంగా రేవంత్​ సర్కార్​ పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో  కాంగ్రెస్​నాయకులు రాజిరెడ్డి,​ వెంకటస్వామి గౌడ్​, మండల అధ్యక్షుడు రవి, పట్టణ అధ్యక్షుడు ఏసురెడ్డి, మాజీ సర్పంచ్​ బాలకిషన్​, జనార్ధన్​రెడ్డి, బాల్​ రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, వెంకట్​చారి, రామస్వామి, దేవరాజు పాల్గొన్నారు. 

జహీరాబాద్: సీఎం రిలీఫ్​ఫండ్​పేద ప్రజలక వరం అనికాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ నేత ఉజ్వల్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గానికి చెందిన 28 మందికి రూ.13.68లక్షల సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులు అందజేశారు. ఆయన వెంటముభిన్, నర్సింహరెడ్డి, రాములు, రాజశేఖర్, భీమయ్య, తహరా బేగం, మల్లికార్జున్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, మల్లికార్జున్ పాల్గొన్నారు.