సిరిసిల్లలో బీజేపీకి షాక్.. అవునూరి రమాకాంత్ రావు రాజీనామా

సిరిసిల్లలో బీజేపీకి షాక్.. అవునూరి రమాకాంత్ రావు రాజీనామా

సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ(బీఆర్ఎస్)కు షాక్ తగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  అవునూరి రమాకాంత్ రావు మంగళవారం(అక్టోబర్ 24) పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు రమాకాంత్ రావు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో తన రాజకీయ లక్ష్యం నెరవేరదని అర్థమైందన్నారు. బీజేపీ అధిష్టానం వలన నాయకులకు నష్టం జరుగుతుంది. సిరిసిల్ల బీజేపీలో గ్రూప్ రాజకీయాలను తట్టుకోలేక పోయానని.. జిల్లా నాయకుడు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. సిరిసిల్ల  బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందు ఒక్కసారి స్థానికులతో సంప్రదించకుంటే ఎలా..? అని,  స్థానికులను పరిగణలోకి తీసుకోకుండా పార్టీ నాన్ లోకల్ అభ్యర్థికి టికెట్ ఎలా ఇస్తారని అన్నారు.

 కొందరు నాయకుల తీరుతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపి బండి సంజయ్ కు పంపించానని ఆయన తెలిపారు.  రమాకాంత్ రావు రాజీనామా చేసి వెంటనే.. బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు  నర్సింగరావు, గూడురి ప్రవీణ్ లు ఆయన ఇంటికి వెళ్ళి  బిఅర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికై సుదీర్ఘంగా చర్చించిన బిజెపి హైకమండ్ ఆదివారం 52 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాణి రుద్రమ రెడ్డిని ఎంపిక చేయడంతో  సిరిసిల్ల టికెట్ ఆశించిన అవునూరి రమాకాంత్ రావు నిరాశే ఎదురైంది. టికెట్ రాకపోవడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.