
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా బెంగాల్ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలిండియా ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌లో సిద్దిపేట జిల్లా వెలుగు ఫొటోగ్రాఫర్ మహిమల భాస్కర్‌రెడ్డికి మెరిట్ ఆవార్డు దక్కింది. కరీంనగర్ టైమ్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫొటో కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 150 ఎంట్రీలు రాగా బెస్ట్ న్యూస్ పిక్చర్ విభాగంలో భాస్కర్ రెడ్డి తీసిన ‘సైకిల్ టైర్‌తో దంతె కొడుతున్న మహిళ’ ఫొటోకు మొదటి బహుమతి లభించింది. ఇదే పోటీలో సంగారెడ్డి జిల్లా ఫొటో గ్రాఫర్ కృష్ణకు కన్షొలేషన్ ప్రైజ్ దక్కింది. లాక్డౌన్ అనంతరం జీవనోపాధి కోసం ‘ఒకే ట్రాక్టర్ ఇంజన్‌కు రెండు ట్రాలీలు కట్టుకు తరలి వెళ్తున్న కూలీల’ ఫొటోకు ఈ బహుమతి దక్కింది. నేడు కరీంనగర్‌లో జరిగే వరల్డ్ ఫొటో గ్రఫీ డే వేడుకల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. - సిద్దిపేట/సంగారెడ్డి టౌన్, వెలుగు