
పంజాగుట్ట, వెలుగు: సనత్నగర్నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతలకు గురువారం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్కోట నీలిమ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. కేంద్రంలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ, ప్రజల హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అన్నారు. పార్టీలోని మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. సభ్యత్వ నమోదులో సనత్నగర్ నియోజకవర్గం ముందు ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సీనియర్ నేత కవిత, ప్రతినిధులు పాల్గొన్నారు.