ఫైర్ సేఫ్టీపై పై విద్యార్థులకు అవగాహన

ఫైర్ సేఫ్టీపై పై విద్యార్థులకు అవగాహన

హైదరాబాద్: ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రంలో ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఎలా స్పందించారో అధికారులు వివరించారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాడే పరికరాల గురించి తెలిపారు.  ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి చేశామన్నారు. నిర్మాణ దారులు సైతం తప్పనిసరిగా రూల్స్ పాటించాలన్నారు. అలాగే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటిపై వివరించారు. ఫైర్ సేఫ్టీలోని ఏ, బీ, సీ, డీ రకాలను క్షుణంగా తెలియజేశారు.  ఫైర్ సేఫ్టీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో దాదాపు 80 మంది రక్తదానం చేశారు.