సాగుపై స్పెషల్ క్లాస్: తాత.. వరి ఎట్ల పండిస్తరు?

సాగుపై స్పెషల్ క్లాస్: తాత.. వరి ఎట్ల పండిస్తరు?

బైంసా వెలుగు : బడిలో పాఠాలు నేర్చుకుంటూనే ఆ పిల్లలు పొలంబాట పడుతున్నారు. వ్యవసాయ రంగంపై క్షేత్రస్థా యిలో అవగాహన పెంపొందిం చుకుంటున్నారు. సాగు పద్ధతులతో పాటు దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలను కూడా తెలుసుకుంటున్నారు. వారే లోకేశ్వరం మండలం రాజురా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ చిన్నారులు.

 టీచర్ చొరవ..

స్కూల్ చెందిన టీచర్ జిలకరి రాజేశ్వర్ పుస్తకాల్లో ఉన్న పాఠ్యాం శాలతో పాటు సామాజిక విషయాలపైనా అవగాహన కల్పిస్తు న్నారు. పాఠ్యాం శాల్లో ఉన్న సారాంశాన్ని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. రోజురోజుకు ప్రాధాన్యత కోల్పోతున్న వ్యవసాయ రంగంపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం, సేం ద్రియ ఎరువుల తయారీ, రసాయన ఎరువుల పిచికారీ గురించి కూడా తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కూడా సందర్శించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. క్షేత్రస్థా యి పర్యటనల వల్ల పిల్లలకు పాఠాలు ఈజీగా గుర్తుంటాయని రాజేశ్వర్ అంటున్నారు. పిల్లల పుస్తకాలు చదవడంతో పాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడాన్ని అందరూ అభినందిస్తున్నారు.

see also: బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

see also: సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!