గౌడవెల్లి పాఠశాలలో.. పోక్సో చట్టం, సోషల్ మీడియాపై అవగాహన

గౌడవెల్లి పాఠశాలలో.. పోక్సో చట్టం, సోషల్ మీడియాపై అవగాహన

గౌడవెల్లి, వెలుగు: ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రిన్సిపల్​సివిల్ జడ్జి కె.యువరాజా విద్యార్థులకు సూచించారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు, వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 

మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో గౌడవెల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం–2012, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను విద్యా సంబంధిత సమాచారం, విజ్ఞానాభివృద్ధి, సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలన్నారు. 

విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని మండల న్యాయ సేవా కమిటీ సభ్యురాలు ఎం. ప్రసన్న పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణ, చట్టాలపై అవగాహన, సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.