
పేదల సొంతింటి కళను నిజం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం చాలా ఉపయోగ పడుతుందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇంటి నిర్మాణానికి ప్రతి కుటుంబానికి మూడున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అందే వరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
భాగ్యనగర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై జరిగిన అవగాహన సదస్సులో వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పాల్గొన్నారు.