
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాసేవకుడిగా చేస్తున్నది పక్కన పెడితే ఆయన సొంత వ్యాపార లాభదాయకతకు మాత్రం అస్సలు ఢోకా లేకుండా చూసుకుంటున్నట్లు మరో సారి భయటపడింది. తన వ్యాపారాలను కాపాడుకుంటూనే భారత ఆర్థిక వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం ఆయనకే బ్యాక్ ఫైర్ అవుతోంది. రష్యాతో వ్యాపారాన్ని మాన్పించేందుకు ట్రంప్ దిగజారిన తీరు.. మాట్లాడిన విధానం ఆయన డబుల్ స్టాండ్స్ గురించి తెలిసిన భారత్ చిరకాల మిత్రుడి విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతూనే ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటూ ఇటీవల ట్రంప్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా కోట్లు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. ట్రంప్ ఒక వ్యాపారి.. ఆయనకు అమెరికాలో ట్రంప్ టరవ్స్ పేరుతో రియల్టీ బిజినెస్ ఉంది. అయితే ఆ పేరును ఇండియాలోని నిర్మాణ సంస్థలకు లైసెన్స్ రూపంలో అమ్ముకుంటూ భారీగానే సొమ్ము వెనకేసుకుంటున్నాడు ట్రంప్.
ALSO READ : ట్రంప్ చెప్పేది అంతా అబద్ధం..మనదేశ టారిఫ్లు చాలా తక్కువ:స్టడీ రిపోర్ట్
కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే ట్రంప్ భారత ప్రాజెక్టుల నుంచి 12 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ మెుత్తాన్ని పొందుతున్నాడనే లెక్కలు బయటకొచ్చాయి. ఇండియా నుంచి సంపాదిస్తూ.. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందంటూ చెప్పటం ఏంటని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2012 నుంచి 2019 మధ్య కాలంలో ట్రంప్ రాయల్టీ రూపంలో ముంబై, పూణే, గురుగ్రామ్, కలకత్తాలోని రియల్టీ ప్రాజెక్టుల ద్వారా 11.3 మిలియన్ డాలర్లు సంపాదించారని తేలింది.
ట్రంప్ పేరుతో దేశంలోని మెట్రో నగరాల్లో 13 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్, నోయిడా, బెంగళూరుల్లో కూడా ప్రాపర్టీలు కట్టి అమ్మాయి భారత రియల్టీ సంస్థలు. తన పేరును జస్ట్ వాడుకోవటానికి ఇవ్వటం ద్వారా ట్రంప్ ఎలా లాభపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
* ట్రంప్ సంస్థ ఆయన పేరును వినియోగించి నిర్మాణాలు చేపట్టేందుకు భారత డెవలపర్లకు లైసెన్సు ఫీజును వసూలు చేస్తుంది
* దీని తర్వాత ఇండియన్ రియల్టీ సంస్థలు స్థలం కొని సొంత డబ్బుతో నిర్మాణాలు చేస్తాయి
* డెవలపర్లు ట్రంప్ పేరుతో కట్టిన కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ప్రీమియం రేట్లకు అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటాయి.
* ట్రంప్ సంస్థకు రాయల్టీ లేదా ప్రాపర్టీ సేల్ విలువలో 3-5 శాతం షేర్ చెల్లిస్తుంటాయి రియల్టీ కంపెనీలు
* ఈ క్రమంలో ప్రాపర్టీల నిర్మాణం ఆగినా, లేటు అయినా, అమ్ముడు కాకపోయినా డెవలపర్లే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ముందుగా అంగీకరించిన డబ్బును ట్రంప్ సంస్థకు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఇదంతా చూసిన వారు ట్రంప్ చేస్తున్నవి పూర్తిగా చిల్లర రాజకీయాల్లా కనిపిస్తున్నాయని.. తమ దేశం రష్యాతో వ్యాపారం చేస్తూనే బయటి దేశాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం సరైనది కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.