ట్రంప్ చెప్పేది అంతా అబద్ధం..మనదేశ టారిఫ్లు చాలా తక్కువ:స్టడీ రిపోర్ట్

ట్రంప్ చెప్పేది అంతా అబద్ధం..మనదేశ టారిఫ్లు చాలా తక్కువ:స్టడీ రిపోర్ట్

న్యూఢిల్లీ: అమెరికా మనదేశాన్ని టారిఫ్​కింగ్​ అంటూ తరచూ నిందిస్తోందని కానీ స్టడీ రిపోర్టులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మనీకంట్రోల్ ఎనాలిసిస్​ ప్రకారం, ప్రపంచ బ్యాంక్ డేటా ఆధారంగా 2022లో భారతదేశ సగటు టారిఫ్​ రేటు 4.6 శాతం మాత్రమే. ఇది ప్రపంచ సగటు కంటే తక్కువ.  

టారిఫ్​ల విషయంలో144 దేశాల్లో, భారతదేశం 64వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, బ్రెజిల్ వంటి దేశాల కంటే తక్కువ టారిఫ్​లను వసూలు చేస్తోంది. భారతదేశం 2001–-2022 మధ్య కాలంలో టారిఫ్​లను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించిన దేశాల్లో ఒకటి. ఇదే కాలంలో యూరోపియన్ యూనియన్ టారిఫ్​లు 61 శాతం, థాయిలాండ్ టారిఫ్​లు 56 శాతం తగ్గాయి.  

1990లో భారతదేశ సగటు టారిఫ్​ రేటు 80.9 శాతంగా ఉండేది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది 56 శాతానికి, 1999 నాటికి 33 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఇది 15.98 శాతంగా ఉంది. మనదేశ వాణిజ్య నిర్మాణాన్ని ప్రతిబింబించే వెయిటెడ్ యావరేజ్ టారిఫ్ 1990లో 56 శాతం నుంచి ఇప్పుడు 4.6 శాతానికి పడిపోయింది. 

గత దశాబ్దంలోనే ఇది 7.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇది భారతదేశం మరింత స్వేచ్ఛాయుత, పోటీతత్వ వాణిజ్య విధానం వైపు సాగుతోందని సూచిస్తుందని రిపోర్ట్​ పేర్కొంది.