IND vs ENG 2025: గంభీర్ అవార్డును తిరస్కరించిన బ్రూక్.. అతనికే ఇవ్వాలంటూ డిమాండ్

IND vs ENG 2025: గంభీర్ అవార్డును తిరస్కరించిన బ్రూక్.. అతనికే ఇవ్వాలంటూ డిమాండ్

ఆండర్సన్- టెండూల్కర్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేశారు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఒకరు కాగా.. ఇంగ్లాండ్ మిగిలి ఆర్డర్ బ్యాటర్ మరొకరు. సిరీస్ అంతటా అద్భుతంగా రాణించిన వీరిద్దరికీ రెండు జట్ల ప్రధాన కోచ్‌లు వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బ్రూక్ కు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ లో బ్రూక్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్  అవార్డు ఇవ్వాలని సూచించాడు. గంభీర్ తీసుకున్న నిర్ణయం పట్ల బ్రూక్ సంతోషంగా లేడు. సిరీస్ అంతటా అద్భుతంగా ఆడిన జో రూట్‌కు ఈ గౌరవం దక్కాలనే తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

బ్రూక్ మాట్లాడుతూ.. "ఈ సిరీస్ లో నేను రూటీ (జో రూట్) చేసినంత పరుగులు చేయలేదు. కాబట్టి అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు అర్హుడు. చాలా సంవత్సరాలుగా జట్టుకు చేస్తున్న కృషికి మ్యాన్ ఆఫ్ ది సమ్మర్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మేము గొప్ప స్థానంలో ఉన్నామని అనుకుంటున్నాను. ఇదొక అద్భుతమైన సిరీస్. నిజం చెప్పాలంటే 2-2 ఫలితాన్ని నేను ఊహించలేదు". అని బ్రూక్  BBCకి చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్రూక్ 53.44 సగటుతో 481 పరుగులు చేయగా.. రూట్ 67.12 సగటుతో 537 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ జట్టు తరపున రూట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా బ్రూక్ ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు.  గిల్ ఐదు మ్యాచ్‌ల్లో ఆడి నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్యాటర్లు ఈ సిరీస్ లో పరుగుల వరద పారించారు. టీమిండియా తరపున ఏకంగా ముగ్గురు ప్లేయర్లు 500 పైగా పరుగులు సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్ తరపున ఈ సిరీస్ లో రూట్, బ్రూక్ నిలకడగా రాణించారు. సిరీస్ సమం కావడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా ఇద్దరికి ప్రదానం చేయాలని ఇరు జట్ల ప్రధాన కోచ్ లు నిర్ణయించుకున్నారు.