విడాకుల కేసులో మహిళపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. భర్తపై అనవసరపు భారం వేయొద్దన్న జడ్జి

విడాకుల కేసులో మహిళపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. భర్తపై అనవసరపు భారం వేయొద్దన్న జడ్జి

ఈరోజుల్లో పెళ్లికి అవుతున్న ఖర్చు కంటే విడాకులకు అవుతున్న ఖర్చే చాలా ఎక్కువగా ఉంటోంది. నేటి యువతలో ఓర్పు తగ్గటంతో కుటుంబ వ్యవస్థ పట్ల చాలా మంది దంపతుల్లో గొడవలు వస్తున్నాయి. కొన్నిసార్లు ఇద్దరి మధ్య ఈగో కూడా పెళ్లిళ్లను పెటాకులు చేస్తున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే అసలు భర్త నుంచి భరణంగా ఎంత డిమాండ్ చేయాలో తెలియని భార్యల సంఖ్య పెరిగిపోతోంది. కుదిరితే లక్షల్లో కాకుండా కోట్లలో డబ్బు, ఇళ్లు, కార్లు అంటూ గొంతెమ్మ కోరికలు కోరటంపై ప్రస్తుతం కోర్టుల్లో జడ్జీలు సైతం సీరియస్ అవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. 

తాజాగా 18 నెలల కాపురం తర్వాత విడాకులకు వెళ్లిన జంట కేసు విషయంలో సుప్రీం కోర్టు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మహిళ తన భర్త నుంచి భరణంగా రూ.12 కోట్లతో పాటు బీఎండబ్ల్యూ కారు, ముంబైలో ఒక ఫ్లాట్ అడగటంపై స్పందించింది. జూలై 21న జరిగిన వాదనల్లో కోర్టు భార్య గొంతెమ్మ కోరికలను తోసిపుచ్చింది. అయితే మెుత్తానికి కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో భార్య కోరికలను తిరస్కరించటానికి కారణాలను వెల్లడించింది కోర్ట్.

2022లో సదరు మహిళ విడాకుల కోసం అంగీకరిస్తూ కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ముంబైలో ఫ్లాట్, రెండు పార్కింగ్ స్పాట్స్ మాత్రమే కోరింది. అప్పుడు రూ.12 కోట్లను డిమాండ్ చేయలేదని కోర్టు గ్రహించింది. ఒత్తిడితో సెటిల్‌మెంట్‌పై సంతకం చేసినట్లు ఆమె చేసిన ఆరోపణలు రుజువు కాకపోవటంతో కోర్టు దానికి ఆధారాలు లేవని గుర్తించింది. ఈ కేసులో భార్య విద్యావంతురాలు కావటం ఆమెకు గతంలో ఉద్యోగం చేసిన అనుభవం ఉండటాన్ని గ్రహించిన కోర్ట్ జీవితాంతం ఆర్థిక సహాయం భర్త నుంచి అవసరం లేదని తేల్చేసింది. 

►ALSO READ | రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి.. మహాధర్నాకు డీఎంకే మద్దతు: కనిమొళి

ముంబైలోని కల్పతరు హాబిటాట్‌లో రెండు కార్ పార్కింగ్‌లతో కూడిన ఒక అద్భుతమైన ఫ్లాట్‌ను ఆమెకు బహుమతిగా ఇవ్వడానికి భర్త అంగీకరించటాన్ని కోర్ట్ అంగీకరించింది. అలాగే ఆ ఇంటిపై ఉన్న రూ.26లక్షల హోమ్ లోన్ తీర్చటానికి సదరు భర్త అంగీకరించాడు. గతంలో సిటీ బ్యాంకులో పనిచేసినప్పుడు అతని వార్షిక వేతనం రూ.2.5 కోట్లు ఉండగా ప్రస్తుతం అది తగ్గినట్లు కోర్ట్ గుర్తించింది. ఈ క్రమంలో అతను మంచి ఆదాయం పొందుతున్నట్లు భార్య వాదనలను కోర్ట్ తిరస్కరించింది. కేవలం లింక్డ్ ఇన్ ఖాతాలో చూపిన ఆదాయాన్ని ప్రామాణికమైనదిగా, విశ్వసనీయమైన సాక్ష్యంగా అంగీకరించటం కుదరదని తేల్చి చెప్పారు జడ్జి. 

ఆమె తాజా డిమాండ్లు భర్తపై అనవసరపు భారాన్ని మోపుతున్నవిగా గుర్తించిన కోర్టు మునుపట అంగీకరించిన పరిష్కారమే సరైనదిగా భావిస్తున్నట్లు వెల్లడించింది కోర్ట్. సదరు వ్యక్తికి ఆటిజన ఉన్న బిడ్డ బాధ్యతలు కూడా ఉన్నందున భార్త కోరికలు సరైనవి కాదని.. ఇంకా భర్త నుంచి ఏవైనా ఆర్థిక ప్రయోజనాలు కోరటం అన్యామేనని కోర్ట్ పేర్కొంది. ఆగస్టు 30 నాటికి అపార్ట్‌మెంట్ బహుమతిగా ఇచ్చి, బకాయిలు చెల్లించిన తర్వాత విడాకులు అమలులోకి వస్తాయని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.